ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏది క్షేమం?

ABN, First Publish Date - 2020-08-04T10:09:22+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు తామెక్కడ వైద్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి వైద్యమా.. ఆసుపత్రి వైద్యమా..!!

కరోనా చికిత్సపై బాధితుల్లో గందరగోళం

వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారాలతో అయోమయం


ఖమ్మం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు తామెక్కడ వైద్యం తీసుకుంటే మంచిదో అర్థం కాని గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం.. మరో వైపు వైద్యులు, వైద్య నిపుణులు ఎవరికి వారు చేస్తున్న ప్రకటనలు జనాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. కొందరు ఇళ్లలోనే ఉండి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని, ఇంకొందరు ఆసుపత్రులకు వెళ్లాలని చెబుతుండటంతో బాధితులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అసలు తాము ఎక్కడ? ఏ వైద్యం  తీసుకుంటే క్షేమంగా ఉంటామో అర్థంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కరోనాబారిన పడిన వారు కొందరు.. గతంలో పాజిటివ్‌ వచ్చి కోలుకున్న వారి నుంచి సలహాలు తీసుకుంటుండటం గమనార్హం.


కొందరైతే తమకు తెలిసిన వైద్యులను సంప్రదించి మందులను వాడడం, కషాయాలు, వేడినీళ్లు తాగడం, పసుపు నీటితో ఆవిరిపట్టడం లాంటి రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తున్నారు.  జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి లక్షణాలు ఏది కనిపించినా కరోనానే అన్న భయంతో వణికిపోతున్నవారు చాలామంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో రోజుకు 50నుంచి 100 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1078పాజిటివ్‌ కేసులు నమోదవగా 30మంది మృతిచెందారు. భద్రాద్రి జిల్లాలో 243పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఏడుగురు మృతిచెందారు.  ఈ క్రమంలో టెస్టుల కోసం బాధితులు నిర్ధారణ కేంద్రాలు, పీహెచ్‌సీల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం ఆసుపత్రి వర్గాలు మాత్రం.. లక్షణాలుంటే తొలుత ఆసుపత్రిలో చేరాలని, ఆతర్వాతే టెస్టులు చేస్తామని చెబుతుండటంతో భయంతో జనం అటు వైపు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మమతా మెడికల్‌ కళాశాలలో కూడా కరోనా పరీక్షలు ప్రారంభం కావడం, ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయడంతో కొందరు మమతాకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. 


డాక్టర్ల సలహాలతో వైద్యచేయించుకుంటేనే మంచిది ..బాగం కిషన్‌రావు, మమతా మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌

కరోనా వచ్చిన దానికంటే భయంతోనే ఎక్కువమంది ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. నాకు కూడా కరోనా వచ్చింది. ప్రస్తుతం నేను క్వారంటైన్‌లో ఉన్నా. కరోనా గురించి భయపడటం కాదు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదటి 14రోజులు ఎంతో కీలకం. అవసరమైతే పరీక్షలు చేయించుకుని వైద్యసేవలు పొందాలి. ఒకవేళ ఇళ్లలో ఉండాలనుకున్నా సొంత వైద్యం చేసుకోవడం కంటే.. డాక్టర్ల సలహాలతోనే వైద్యం చేయించుకోవడం మంచిది. సోషల్‌మీడియాలో వస్తున్నవి, ఎవరో చెప్పిన మాటలు నమ్మి సొంత వైద్యం చేసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి విషయంలో చుట్టుపక్కల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అవమానకర రీతి వ్యవహరించకుండా కొవిడ్‌ బారిన పడిన వారికి భౌతిక దూరం, జాగ్రత్తలు పాటిస్తూనే సాయం అందించాలి.  

Updated Date - 2020-08-04T10:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising