ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సహాయనిధికి హరిప్రియ, రేగా విరాళం

ABN, First Publish Date - 2020-03-25T11:28:50+05:30

ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి భద్రాద్రి జిల్లా ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు తమ ఒక నెల వేతనాన్ని అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లెందు టౌన్‌, మార్చి 24: ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి భద్రాద్రి జిల్లా ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు తమ ఒక నెల వేతనాన్ని అందించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనావైర్‌సను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఈ మేరకు కరోనా బాధితుల సహయార్థం సీఎం సహయనిధికి తన మార్చి నెల వేతనాన్ని రూ.2.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని, నివాస గృహలనుంచి వీధుల్లోకి రాకుండా పోలీసులకు సహకరించాలని ఎమ్మెల్యే హరిప్రియ విజ్ఙప్తి చేశారు. అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కూడా తన ఒక నెల వేతనం రూ.3,82,000లను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక పటిష్ట కార్యక్రమాల అమలుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు వ్యాపారవేత్తలు, స్వచ్ఛందంగా సంస్థలు, విద్యా సంస్థలు, యాజమాన్యాలు తమకు తోచినంతగా సీఎం సహాయ నిధికి ఆర్ధిక సాయంగా విరాళాలందించాలని కోరారు.   

Updated Date - 2020-03-25T11:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising