ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి పట్టభద్రుల ఓటరు నమోదు

ABN, First Publish Date - 2020-10-01T09:44:25+05:30

నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు నమోదుకు గురువారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 30: నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు నమోదుకు గురువారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గతంలో ఓటుహక్కు ఉన్న వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2017నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటు హక్కు నమోదు కోసం ఆధార్‌కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులను జత చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 1నుంచి వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 11వ తేదీ దరఖాస్తుకు ఆఖరు తేదీ కాగా డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.


ఎన్నికలు జరిగే జిల్లాలో అధికారులు పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలనుకునేవారు సీఈవోతెలంగాణ. ఎన్‌ఐసీ. ఇన్‌ ద్వారా లేదంటే హెచ్‌టీటీపీఎస్‌ /డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌ ద్వారా ఫారం-18ను భర్తీచేయాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు, డిగ్రీ సర్టిఫికెట్‌ ద్రువీకరణ పత్రాలను స్కాన్‌ చేసి దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-10-01T09:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising