ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్ణయాల వల్లే మధిరలో కరోనా

ABN, First Publish Date - 2020-05-20T10:21:11+05:30

ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, మధిర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కట్టడిలో రాష్ట్రప్రభుత్వం విఫలం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


మధిర టౌన్‌, మే 19: ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, మధిర మండలం మహదేవపురంలో ఒకరికి పాజిటివ్‌ రావడానికి కూడా ఇదే కారణమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 55రోజులుగా అధికారులు, ప్రజలు ఒక తపస్సులా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించారని.. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అది కాస్తా బూడిదపాలైందన్నారు.


కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. ప్రభుత్వం వలస కూలీలకు ఇచ్చిన సడలింపులతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. స్వస్థలాలకు చేరుకున్న వారిని 14రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి అన్నిపరీక్షలు చేసిన తర్వాత వారివారి గ్రామాల్లోకి అనుమతించినట్లయితే ఈ ముప్పు ఉండేది కాదన్నారు.


అలాగే మద్యంషాపులు తెరవడం కూడా కరోనా వ్యాప్తికి కారణమైందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలవల్లేనని, భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వలస కార్మికుల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని తక్షణమే మండలానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి వారిని అక్కడ ఉంచాలని అవసరమైతే తన సొంతఖర్చులతో క్వారంటైన్‌ సెంటర్లో ఉన్నవారికి భోజన సదుపాయాలు కల్పిస్తానన్నారు. 

Updated Date - 2020-05-20T10:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising