ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్డీ నేత గరిమెళ్ల కన్నుమూత

ABN, First Publish Date - 2020-11-21T06:44:23+05:30

కామ్రెడ్‌ బత్తుల వెంకటేశ్వరరావు, రవన్నల ప్రధాన అనుచరుడు, బత్తుల వెంకటేశ్వరరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ బాధ్యులు గరిమెళ్ల నరసింహారావు(69 )కన్నుమూశారు. శుక్రవారం వరంగల్‌లో గుండెపోటుతో మృతిచెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నివాళులర్పించిన తుమ్మల, సండ్ర, మువ్వా, ఇరురాష్ట్రాల న్యూడెమొక్రసీ నాయకులు


సత్తుపల్లిరూరల్‌, నవంబరు 20: కామ్రెడ్‌ బత్తుల వెంకటేశ్వరరావు, రవన్నల ప్రధాన అనుచరుడు, బత్తుల వెంకటేశ్వరరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ బాధ్యులు గరిమెళ్ల నరసింహారావు(69 )కన్నుమూశారు. శుక్రవారం వరంగల్‌లో గుండెపోటుతో మృతిచెందారు. ఉద్యమాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన సహచరుడు బత్తుల వెంకటేశ్వరరావు పేరుతో సత్తుపల్లి పట్టణంలో 1983లో మెమోరియల్‌ ట్రస్ట్‌ గ్రంథాలయం పేరుతో సాహిత్యంతో పాటు కొన్ని వేలమందికి విజ్ఙానాన్ని అందించడంలో ఎనలేని కృషి చేశారు. 


అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి గరిమెళ్ల

గ్రంథాలయ బాధ్యుడిగా ఈ ప్రాంతానికి అభ్యుదయ భావాలను అందించిన గరిమెళ్ల తనకు అత్యంత సన్నిహితుడని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎటువంటి మచ్చలేని వ్యక్తి గరిమెళ్ల అని వర్ణించారు. సాహిత్యాన్ని ఈ ప్రాంతానికి అందించడంలో గరిమెళ్ల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గరిమెళ్ల భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌తో పాటు నాయకులు గాదె దివాకర్‌, టీ.సుధాకర్‌, పీ.ప్రసాద్‌, పీ.రంగారావు, కే.రమ, రాయల చంద్రశేఖర్‌, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కూకలకుంట రవి, ఏ.రాము, ఏ.వెంకన్న, జీ.ప్రభాకర్‌, కేఎస్‌.ప్రదీప్‌, ఏ.శరత్‌, గంటా శ్రీను, సంధ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T06:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising