ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు జిల్లాలో నలుగురు మృతి

ABN, First Publish Date - 2020-08-15T10:08:30+05:30

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇరు జిల్లాల్లో శుక్రవారం 196 పాజిటివ్‌ కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం/కొత్తగూడెం నెట్‌వర్క్‌, ఆగస్టు 14: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇరు జిల్లాల్లో శుక్రవారం 196 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 125మందికి, భద్రాద్రి జిల్లాలో 71మందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో శుక్రవారం 110మంది డిశార్జ్‌ అయినట్లు డీఎంహెచ్‌వో ప్రకటించారు. ఇదిలా ఉండగా మద్దులపల్లి క్వారంటైన్‌ సెంటర్‌నుంచి ఒక పాజిటివ్‌ వ్యక్తి పరారయ్యాడు. క్వారంటైన్‌ కేంద్రం ఇంచార్జ్‌ డీటీడీవో ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


భద్రాద్రి జిల్లాలో 71 పాజిటివ్‌ కేసులు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెంలో ఐదుగురికి, చుంచుపల్లిలో ఇద్దరు, బూర్గంపాడులో ఐదుగురికి, అశ్వారావుపేటలో 8, ఇల్లెందులో 9, పాల్వంచలో 7, భద్రాచలంలో 32, టేకులపల్లి మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. మణుగూరు, చర్ల, గుండాల, ఆళ్లపల్లి, పినపాక మండలాల్లో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం కరోనాతో ఖమ్మం జిల్లాలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగ సంఘం నేత(75),  వైరా మండలంలో వృద్ధురాలు(65), భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి(39), ఇల్లెందు మండలానికి చెందిన ఓ మహిళ(50) కరోనాతో మృతి చెందారు. 

Updated Date - 2020-08-15T10:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising