ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం దిగి వచ్చే వరకు రైతుల తిరుగుబాటు ఆగదు

ABN, First Publish Date - 2020-12-05T05:10:06+05:30

కేంద్రం దిగి వచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతుల తిరుగు బాటు ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం స్పష్టం చేశారు.

సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక ఎన్నిక తరువాత టీఆర్‌ఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని 

బోనకల్‌, డిసెంబరు 4: కేంద్రం దిగి వచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతుల తిరుగు బాటు ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం స్పష్టం చేశారు. బోనకల్‌ మండలం ముష్టికుం ట్ల గ్రామంలో శుక్రవారం నిర్వ హించిన ‘కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఢిల్లీ లో ఎనిమిది రోజులుగా రైతు లు చేస్తున్న మిలిటెంట్‌ పోరాటాలకు తాము మద్దతు ఇస్తున్నామని, వారి ఉద్య మం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రైతులకు తీవ్రనష్టం కలిగించేలా చట్టాలు తెచ్చి కార్పొరేట్‌ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహ రిస్తుండటంతో ఎన్నడూ లేని విధంగా రైతులు కేంద్రంపై తిరుగుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుబ్బాక ఎన్నిక తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనడానికి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. పాలక పార్టీలు ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని, క్రమేణా ప్రజల్లో మార్పు వస్తోందని, అలాంటి బూర్జువా పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని, భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యామ్నాయం కానున్నాయన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. బోనకల్‌ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు, నాయకులు దొప్ప కొరివి, జెట్టి బాలశౌరి, చెల్ది ప్రసాద్‌, కందికొండ శ్రీనివాసరావు, బొడ్డుపల్లి వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, బంధం శ్రీనివాసరావు, గుగులోతు నరేష్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T05:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising