ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులపై దృష్టిసారించండి

ABN, First Publish Date - 2020-07-10T10:47:00+05:30

ప్రస్తుత వర్షాకాల తరుణంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీపీవో శ్రీనివాసరెడ్డి 


తిరుమలాయపాలెం, జూలై9: ప్రస్తుత వర్షాకాల తరుణంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాల సీజన్‌లో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాలను కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఉంచాలన్నారు. ముఖ్యంగా దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మంచినీటి ట్యాంకులు, హ్యాండ్‌ బోర్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, మంచినీటి ట్యాంకులను కూడా క్లోరినేషన్‌తో శుభ్రపరచాలన్నారు. పల్లె ప్రగతిలో పెండింగ్‌ల పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బి. జయరాం, ఈవోఆర్‌డీ రాజేశ్వరి, ఎపీవో నర్సింహారావు, కార్యదర్శులు బాలాజీ, రేఖ, సాయి, సునీత, సుష్మిత, తులసీరాం, రాంలాల్‌, వసంత పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising