ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు పోటెత్తిన తెల్ల బంగారం

ABN, First Publish Date - 2020-10-20T06:08:36+05:30

నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు తెల్ల బంగారం (పత్తి ) పోటెత్తింది. సోమవారం సుమారు 10 వేల పత్తి బస్తాలను అమ్మకానికి రైతులు తీసుకొచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీజన్‌లో తొలిసారిగా 10 వేల బస్తాలు రాక


ఖమ్మం మార్కెట్‌, అక్టోబరు 19: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు తెల్ల బంగారం (పత్తి ) పోటెత్తింది. సోమవారం సుమారు 10 వేల పత్తి బస్తాలను అమ్మకానికి రైతులు తీసుకొచ్చారు. మార్కెట్‌కు గత 20 రోజులుగా కొత్త సీజన్‌ పత్తి రావడం మొదలైన దగ్గర్నుంచి ఇంత మొత్తంలో రావడం ఇదే ప్రధమం. మరి కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉండటంతో పెద్దమొత్తంలో రైతులు తమ పంటలను అమ్మకానికి తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు ఖమ్మం జిల్లాతో పాటుగా భధ్రాధ్రి కొత్తగూడెం, మహబూబాద్‌, సూర్యాపేట, ఏపీ లోని క్రిష్ణా జిల్లాలనుంచి రైతులు తమ పంటలను అమ్మకానికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం కొత్త పత్తి ధరలు కొంత మేర పెరిగాయి. సీజన్‌ ప్రారంభంలో క్వింటాలు రూ. 3000 ల నుంచి రూ. 3500 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం క్వింటాలు పత్తిని రూ. 4000 ల నుంచి రూ. 4500 ల వరకు కోనుగోలు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్ళను మార్కెట్‌ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశంలు సమీక్షించారు.

Updated Date - 2020-10-20T06:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising