ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం దుర్మార్గం

ABN, First Publish Date - 2020-07-07T10:26:09+05:30

ఓ వైపు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రభుత్వం వారిపై విద్యుత్‌ బిల్లుల భారం మోపడం దుర్మార్గమని సీఎల్పీ నేత మల్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

మధిరలో విద్యుత్‌ కార్యాలయం ఎదుట ధర్నా


మధిర టౌన్‌, జూలై 6: ఓ వైపు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రభుత్వం వారిపై విద్యుత్‌ బిల్లుల భారం మోపడం దుర్మార్గమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యుత్‌ బిల్లుల నియంత్రణ లేకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఖమ్మం జిల్లా మధిర విద్యుత్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే విద్యుత్‌ బిల్లులను ఇష్టారీతిన వేసి, వాటిని చెల్లించకపోతే కనెక్షన్లు కట్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రాన్ని ఇద్దామంటే, పదిరోజులుగా ముఖ్యమంత్రి కనబడటం లేదన్నారు.


విద్యుత్‌శాఖ మంత్రికైనా చెబుదామంటే ఆయనకు ఆ శాఖపై అవగాహన లేదని, సీఎంకుసేవలు చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం విద్యుత్‌ బారాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని, పేదవారికి విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లాది వాసు, రంగా హన్మంతరావు, సూరంశెట్టి కిషోర్‌, చావా వేణు, మిరియాల గుప్తా, దారా బాలరాజు, పల్లపోతు ప్రసాదరావు, మిరియాల కాశి, కోనా దని కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-07T10:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising