ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెంగ్యూ నియంత్రణకు కృషిచేయాలి

ABN, First Publish Date - 2020-07-14T11:14:44+05:30

డెంగ్యూ నియంత్రణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై13: డెంగ్యూ నియంత్రణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. సోమవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఏఎన్‌ఎంలు, పారిశుధ్య సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్‌లో వైద్య సిబ్బంది ఏఎన్‌ఎంలు అంగన్‌వాడీలు బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి డ్రైడే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.   వైద్య ఆరోగ్య, నగరపాలక సంస్థ మెప్మా సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


  జరగాలనిరాబోయే రోజుల్లో ఒక్క డెంగ్యూ కేసు జిల్లాలో నమోదు కాకుండా చూడాలని చెప్పారు. డెంగ్యూ నిర్థారణకు సంబందించి కేవలం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మాత్రమే నిర్థారణ పరీక్షలు చేస్తారని ప్రవేటు వైద్యశాలలు ల్యాబులు డెంగ్యూ నిర్థారణ పరీక్షలను చేయడానికి వీల్లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్‌ హెచ్చరించారు.


కోవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టడంతో పాటు సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు అవసరమని రాబోయే మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో నగర కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సైదులు, కార్పోరేషన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారులు ఏఎన్‌ఎంలు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising