ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామాయిల్‌ గెలలను ఇతర ఫ్యాక్టరీలకు తరలించొద్దు

ABN, First Publish Date - 2020-09-23T07:07:38+05:30

పామాయిల్‌ గెలలను ఇతర ఫ్యాక్టరీలకు తరలించి, మన ఫ్యాక్టరీకి నష్టం కలిగించవద్దని పామాయిల్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వారావుపేట,. సెప్టెంబర్‌ 22: పామాయిల్‌ గెలలను ఇతర ఫ్యాక్టరీలకు తరలించి, మన ఫ్యాక్టరీకి నష్టం కలిగించవద్దని పామాయిల్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, శీమకుర్తి వెంకటేశ్వరరరావులు కోరారు. మంగళవారం నారంవారిగూడెంలోని ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ కార్యాలయంలో పామాయిల్‌ రైతుల సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక నుండి పామాయిల్‌ రైతులకు వారానికి రెండు దఫాలుగ చెల్లించే వెసులు బాటు కల్పించడం పట్ల ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మలకు కృతజ్ఘతలు తెలిపారు. పక్వానికి వచ్చిన గెలలనే ఫ్యాక్టరీకి పంపాలని, తద్వార రికవరీ శాతం పెంపుకు రైతులు అందరూ సహకరించాలని కోరారు. తెల్లదోమ లాంటి తెగుళ్ళుపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పలు పరికరాలను ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రాయితీపై రైతులకు అందించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన పామాయిల్‌ రైతు కోడూరి వెంకటేశ్వరరావుకు నివాళులర్పించారు. కార్యక్రమంలో తలసిల ప్రసాద్‌, అంకత మల్లిఖార్జునరావు, మేనేజర్లు శ్రీకాంత్‌, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T07:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising