ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతాశిశుమరణాల రేటును తగ్గించండి

ABN, First Publish Date - 2020-12-12T04:30:57+05:30

జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ నాయక్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ నాయక్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబర్‌ 11: జిల్లాలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ నాయక్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సంయుక్త సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మా ట్లాడుతూ గర్బిణీస్త్రీల నమోదు సకాలంలో చేయడంతో పాటు వారికి ప్రతి నెల ఇమ్యునైజేషన్‌ చేయడం, ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పు జరిగేల సేవలందిందచాలన్నారు. అన్ని జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తూ కొవిడ్‌ నియం త్రణలో భాగంగా ప్రజలకు ఆరోగ్య విద్యనందించాలన్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, గుంపులుగుంపులుగా సంచరించవద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన ప్రతి బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీహెచ్‌వో నాగభూషణం, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ పొన్నెకంటి సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T04:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising