ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపం.. కార్తీక శోభితం..

ABN, First Publish Date - 2020-11-30T04:58:24+05:30

కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం సాయంత్రం నుంచే పౌర్ణమి ప్రారంభం కావడంతో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. సహస్ర దీపాలంకరణ, జ్వాలాతోరణ ఉత్సవాలను నిర్వహించారు.

ఖమ్మంలోని గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

ఖమ్మం సాంస్కృతికం / కొత్తగూడెం సాంస్కృతికం, నవంబరు 29: కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం సాయంత్రం నుంచే పౌర్ణమి ప్రారంభం కావడంతో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. సహస్ర దీపాలంకరణ, జ్వాలాతోరణ ఉత్సవాలను నిర్వహించారు. ఖమ్మం గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దీపోత్సవంలో కలెక్టర్‌ దంపతులు ఆర్వీ కర్ణన్‌, ప్రియాంక కుంటుంబసభ్యులతో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం ఆకాశదీప పూజల్లో పాల్గొన్నారు. వైరారోడ్‌ పవనసుత జలాంజనేయస్వామి ఆలయం, బ్రాహ్మణబజార్‌ శివాలయం, రోటరీనగర్‌, ఎస్పీఆఫీస్‌ రోడ్‌, మధిర, సత్తుపల్లి, వైరా, తల్లాడ, కూసుమంచి శివాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఖమ్మంలోని యూపీహెచ్‌ కాలనీలోని స్వయంభు అభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం నిర్వహించనున్నారు.


Updated Date - 2020-11-30T04:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising