ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

ABN, First Publish Date - 2020-12-11T05:22:27+05:30

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో ఖమ్మం జిల్లా మధిరలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతదేహల వద్ద విలపిస్తున్న బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రోడ్డు ప్రమాదంలో ఒకే కుంటుంబంలో ముగ్గురి దుర్మరణం

కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ప్రమాదం 

మధిర పట్టణంలో తీవ్ర విషాదం

 మధిరటౌన్‌, డిసెంబరు 10: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో ఖమ్మం జిల్లా మధిరలో తీవ్ర విషాదం నెలకొంది. వేములవాడలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కృష్ణా జిల్లా గరికపాడు వద్ద గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిన ప్రమాదంలో మధిర పట్టణానికి చెందిన పాన్‌ షాపు నిర్వాహకుడు మాచర్ల శ్యాం(50), అతడి భార్య శారద(45)తో పాటు వదిన మాచర్ల భాగ్యమ్మ ఆమె కుమారుడు మాచర్ల నవీన్‌, కోడలు మాచర్ల శ్యామల (35), మనుమరాలు మాచర్ల మవ్యతో కలిసి ఎనిమిదిన రాత్రి కారులో వేములవాడకు వెళ్లారు. మార్గమధ్యలో వరంగల్‌లోని భాగ్యమ్మ చిన్న కుమారుడు ప్రవీణ్‌ ఇంటికి వెళ్లి అతడి పిల్లలు అక్షయ్‌, మనును తీసుకొని వేములవాడ వెళ్లారు.  దైవ దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో ఖమ్మం కరీంనగర్‌ రహదారి సరిగా లేకపోవడంతో సిద్దిపేట నుంచి సూర్యాపేట జాతీయ రహదారి మీదుగా మధిరకు బయలుదేరారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో ముందు వెళుతున్న లారీని వీరు ప్రయాణిస్తున్నకారు ఢీ కొనటంతో శ్యాంతో పాటు అతని భార్య శారద, శ్యామల అక్కడికి అక్కడే ముృతి చెందారు. కారు డ్రైవర్‌ సైదులుతో పాటు మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-11T05:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising