ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిదశలో వైద్య సిబ్బందికి కొవిడ్‌ టీకాలు

ABN, First Publish Date - 2020-12-30T04:48:25+05:30

కొత్తగూడెం పురపాలక సంస్థ పరిధిలో కొవిడ్‌ టీకా వేసేందుకు సన్నాహాక ఏర్పాట్లపై చర్చలు ప్రారంభమయ్యాయి.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ

కొత్తగూడెం టౌన్‌, డిసెంబరు 29 : కొత్తగూడెం పురపాలక సంస్థ పరిధిలో కొవిడ్‌ టీకా వేసేందుకు సన్నాహాక ఏర్పాట్లపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు మంగళవారం మునిసిపల్‌ కోఅర్డినేటర్‌ కమిటీ సమావేశం జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి నాగేంద్రప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిధిగా మునిసిపల్‌ టాస్క్‌పోర్స్‌ కోఅర్డినేటర్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, మెంబర్‌, కన్వీనర్లుగా పురపాలక కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అదేశాల మేరకు మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైధ్యశాలల వైద్య సిబ్బందికి టీకా వేస్తారని, వార్డుల వారీగా అన్‌లైన్‌ చేసుకున్న అభ్యర్థుల ప్రకారం జాబితా తయారు చేసేందుకు కార్యచరణ పూర్తి చేయాలన్నారు. కేంద్రాల ఎంపిక, ఒక్కో కేంద్రంలో ఎంత మంది సిబ్బందిని కేటాయించాలో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రం తరహాలో టీకా కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. రెండో దశలో పోలీసులు, మునిసిపల్‌ సిబ్బంది, పాత్రికేయులు, ఇతరులు, మూ డో దశలో యాబై సంవత్సరాలు పైబడిన వారిలో టీబీ, క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధిగ్రస్థులకు వేయనున్నామన్నారు.  ప్రజల సౌలభ్యార్ధం జనవరి 15న పల్స్‌ పోలియో నిర్వహిస్తామని సీతాలక్ష్మి అన్నారు. సమావేశంలో డిఫ్యూటీ డీఎంహెచ్‌వో బావ్‌సింగ్‌, ఏం. వెంకటేశ్వర్లు, పీవోఏంసీహెచ్‌ సుజాత, పీవో ఎఫ్‌పీ స్వాతిశ్రీ, యూపీహెచ్‌సీ మెడికల్‌ అధికారి అస్సిషోరాన్‌, సంజీవరావు, మహమూద్‌పాషా, సీహెచ్‌వో నాగభూషణ, డిప్యూటీ డెమో ఇన్‌చార్జ్‌ విజయ్‌కుమార్‌, కమ్యూనిటీ అర్గనైజర్‌ పొన్నెకంటి సంజీవరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T04:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising