ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షా కాలం

ABN, First Publish Date - 2020-08-22T11:00:19+05:30

ఖమ్మంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్ధారణ కోసం అనుమానితుల బారులు

ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా రికార్డుస్థాయిలో కేసులు

శుక్రవారం ఒక్కరోజే 385 పాజిటివ్‌లు 


ఖమ్మం, ఆగస్టు 21: ఖమ్మంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు. ఓ వైపు సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో జ్వరాలు వస్తుండగా.. కరోనా అన్న అనుమానంతో చాలామంది ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగుఅర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రాలకు కరోనా ర్యాపిడ్‌ కిట్లు అందజేసిన వైద్యశాఖ అధికారులు గతంలో రోజుకు 300 నుంచి 400 వరకు మాత్రమే టెస్టులు నిర్వహించేవారు.


ఆ సమయంలో రోజుకు 30 నుంచి 70 కేసుల వరకు పాజిటివ్‌ వచ్చేవి. ఈ క్రమంలో రెండు నెలలుగా జిల్లాలో 125 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కానీ అనుమానితులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు రెండు రోజులుగా జిల్లాలో వైద్యశాఖ అధికారులు టెస్టుల సంఖ్యను పెంచారు. దీంతో గతంకంటే భిన్నంగా గురు, శుక్రవారాల్లో ఆ సంఖ్య రెండింతలు పెరిగింది. గురువారం 801 మందికి పరీక్షలు నిర్వహించగా 193మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక శుక్రవారం ఆ టెస్టుల సంఖ్య మరింత పెంచి 1658 మందికి పరీక్షలు చేశారు. ఈ క్రమంలో 385మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 


కేంద్రాల వద్ద తలెత్తుతున్న సమస్యలు.. 

కరోనా కిట్లు, పీపీఈ కిట్లు, ఇతర సౌకర్యాలను కల్పించిన అధికారులు కరోనా పరీక్షల సమయంలో డేటా ఎంట్రీకి సరిపడా ఉద్యోగులను కేటాయించలేకపోవడంతో కరోనా పరీక్షా కేంద్రాల వద్ద సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే పది నిమిషాల వరకు పడుతుండటం, ఆ వ్యక్తి వివరాలు, శ్యాంపిళ్ల వివరాలు నమోదు చేయడానికి మరో ఐదు నిమిషాలు పడుతుంది. ఈ క్రమంలో క్యూలో ఉన్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.


ఉదాహరణకు ఖమ్మంనగరంలోని మామిళ్లగూడెం అర్బన్‌ హెల్త్‌ కేంద్రానికి శుక్రవారం 70మంది వరకు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చారు. కానీ డేటా ఎంట్రీ చేసే వారు లేక పోవటంతో మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో గంటల తరబడి క్యూలో నిల్చోలేక ఇబ్బంది పడ్డారు. ఒకరినొకరు నెట్టుకుంటూ.. భౌతిక దూరం పాటించకుండా నిలుచోవడం కనిపించింది. కాగా కరోనా పరీక్షలు పెంచిన రెండు రోజుల నుంచి ప్రాథమిక కేంద్రాల స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించుకొలేక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.  

Updated Date - 2020-08-22T11:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising