ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరుజిల్లాల్లో 263మందికి కరోనా

ABN, First Publish Date - 2020-09-16T06:56:49+05:30

ఉమ్మడిఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరుజిల్లాల్లో మరో 263మంది కరోనా బారినపడినట్టు మంగళవారం నిర్ధారణైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామేపల్లి మండలంలో ఒకరు మృతి


కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మంసంక్షేమవిభాగం/ కామేపల్లి, సెప్టెంబరు 15: ఉమ్మడిఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరుజిల్లాల్లో మరో 263మంది కరోనా బారినపడినట్టు మంగళవారం నిర్ధారణైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 160, ఖమ్మం జిల్లాలో 103మందికి పాజిటివ్‌ వచ్చింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం మొత్తం 1,295 మందికి ర్యాపిడ్‌ పరీక్ష నిర్వహించగా 160మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.


ఖమ్మం జిల్లాలో 103మందికి లక్షణాలున్నట్టు రాష్ట్ర వైద్యశాఖ ప్రకటించిన బులిటెన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన ఓ చిరు వ్యాపారి కరోనాలక్షణాలతో మృతిచెందాడు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఖమ్మంలోని ఓ ప్రెవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. 

Updated Date - 2020-09-16T06:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising