ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఆరుగురికి పాజిటివ్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల లెక్క ఇదీ..!

ABN, First Publish Date - 2020-06-29T17:35:21+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చుంచుపల్లి/ఖమ్మం(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరుజిల్లాల్లో ఆదివారం ఆరు కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఓ కాంగ్రెస్‌ నాయకుడు కరోనా భారిన పడ్డాడు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆ పార్టీనేత, మాజీ రాజ్యసభ సభ్యుడి కార్యక్రమాల్లో సదరు నేత పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదే నాయకుడి పర్యటనలో విధులు నిర్వహించిన కొత్తగూడేనికి చెందిన ఓ ఎస్సైతోపాటు మరో కానిస్టేబుల్, పాల్వంచలో ఇద్దరు యువతులు కరోనా బారిన పడ్డారు..


ఖమ్మం నిజాంపేటలో కరోనా పాజిటీవ్‌ కేసు నమోదు 

ఖమ్మం నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ నమోదైంది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 43ఏళ్ల మహిళ వరంగల్‌లోని ఛాతి ఆసుపత్రిలో వైద్యం కోసం వారం రోజుల క్రితం వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 63కు చేరింది. రాష్ట్రస్థాయి నుంచి వెలువడిన హెల్త్‌ బులిటెన్‌లో మాత్రం మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించటం గమనార్హం.

Updated Date - 2020-06-29T17:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising