ప్రారంభోత్స ఏర్పాట్లు పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-12-06T04:30:21+05:30
మంత్రుల పర్యటన ఖరారైన నేపథ్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తిచేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కర్ణన్
ఖమ్మంకార్పొరేషన్, డిసెంబరు5: మంత్రుల పర్యటన ఖరారైన నేపథ్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తిచేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్‌అలీ, వేముల ప్రశాంతరెడ్డి ప్రారంభించే ఐటీహబ్, బల్లేపల్లి వైకుంఠధామం, ఎన్నెస్పీ వాక్-వే, పొలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ శని వారం పరిశీలించారు. శిలాఫలకాలు, సభా ప్రాంగణం ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదన్నారు. ఐటీహబ్ ప్రాంగణంలో మంత్రుల సభ ఉంటుందని, సభావేదిక ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, శిక్షణకలెక్టర్ వరుణ్‌రెడ్డి, సంబంధితశాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T04:30:21+05:30 IST