ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణిలో లే-ఆఫ్‌ సడలింపు

ABN, First Publish Date - 2020-05-22T10:34:50+05:30

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సింగరేణి సంస్థలోనూ లే ఆఫ్‌ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం


కొత్తగూడెం, మే 21 : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సింగరేణి సంస్థలోనూ లే ఆఫ్‌ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వగా.. గురువారం నుంచి సింగరేణి సంస్థలోనూ లే ఆఫ్‌ను సడలించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోని అండర్‌ గ్రౌండ్‌ బొగ్గుబావుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. 50 రోజులుగా లే-ఆఫ్‌ విధించడంతో విధులకు హాజరుకాని కార్మికులు... తాజా సడలింపుతో జిల్లాలోని మూడు ఏరియాల్లో అండర్‌ గ్రౌండ్‌లో పనిచేసే కార్మికులు షిఫ్టుల వారీగా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తిని చేపట్టారు.


ఈ క్రమంలో ఉన్నతాధికారులు మంగళవారమే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కార్మికులు, అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియమాలను సూచించారు. జిల్లాలో మూడు ఏరియాల పరిధిలోని ఓసీల్లో యంత్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతుండగా.. ఓపెన్‌ కాస్ట్‌ గనులు, భూగర్భ గనులు కలిసి రోజుకు సుమారు 50వేల టన్నుల ఉత్పత్తి అవుతుంది.  

Updated Date - 2020-05-22T10:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising