చింతవర్రె ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్
ABN, First Publish Date - 2020-12-30T04:28:58+05:30
చింతవర్రె ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్
పూర్తి నివేదిక ఇవ్వాలని భద్రాద్రి జిల్లా అధికారులకు ఆదేశాలు
కలెక్టర్, ఎస్పీ, స్ర్తీశిశు సంక్షేమశాఖ అధికారులకు ఉత్తర్వులు
కొత్తగూడెం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రె పాఠశాల ఉపాధ్యాయుడు దొడ్డా సునీల్‌కుమార్ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి జనవరి 5లోపు తమకు నివేదిక సమర్పించాలని భదాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునిల్‌దత్, స్ర్తీశిశు సంక్షేమశాఖ అధికారి ఆర్.వరలక్ష్మికి మంగళవారం బాలల హక్కుల కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాసరావు నుంచి ఉత్తర్వులు అందాయి. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితుడికి, అతడికి సహకరించిన వారికి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Updated Date - 2020-12-30T04:28:58+05:30 IST