ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం

ABN, First Publish Date - 2020-12-28T04:36:29+05:30

నియోజక వర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

చొప్పాలలో చెక్‌ డ్యాం నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెక్‌డ్యాంల శంకుస్థాపనలో ఎమ్మెల్యే రేగా కాంతారావు

కరకగూడెం/ పినపాక/ మణుగూరు డిసెంబరు 27: నియోజక వర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మణుగూరు, కరకగూడెం, పినపాకలో పర్యటించారు. ముం దుగా కరకగూడెంలో నీటి పారుదల శాఖ నిధులు రూ.10కోట్లతో నిర్మించనున్న చొప్పాల పెదవాగు, మోతె పె దవాగు, తాటిగూడెం పెదవాగు, కలవలనాగారం రాళ్ళవాగులపై పలు చెక్‌ డ్యాంలకు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే నియోజకవర్గంలో సు మారు రూ.29 కోట్లతో వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఇప్పటికే మి షన్‌ కాకాతీయ ద్వారా పలు చెరువులను అభివృద్ధి చేశామన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా మరికొన్ని మండలాలకు నిరందించేందుకు ప్రణాళికలు రూపొందించి డీపీఆర్‌లు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం పినపాక మండలంలోని పొట్లపల్లిలో రూ. ఆ రుకోట్లతో పెదవాగుపై చెక్‌ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే కాంతారావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, వైస్‌ ఎంపీపీ అయూబ్‌ఖాన్‌, ఎంపీటీసీలు ఎలిపెద్ది శైలజ, మూనీంద్ర, ఎంపీడీవో శ్రీను, ఇరిగేషన్‌ డీఈ నాగమల్లేశ్వరావు, ఏఈ సక్రు, సర్పంచులు పాయం నరసింహారావు, ఇర్ఫా విజయ్‌, బత్తిని నరసింహారావు, కొమరం విశ్వనాథం, పోలెబోయిన నరసింహారావు, భూక్యా భాగ్యలక్ష్మీ, కుంజా వసంతరావు, సావిత్రి, జవ్వజి రాధ, గొగ్గలి నాగమణి, నాగేశ్వరావు, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, సర్పంచ్‌లు బచ్చల భారతి, జగిడి జ్యోతి, కారం ముత్తయ్య, వైస్‌ ఎంపీపీ కేవీ రావు, ఉపసర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌, సొసైటీ ఛైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, కో ఆప్షన్‌ సభ్యుడు జావీద్‌పాషా, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, నాయకులు అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్‌, యాదగిరి గౌడ్‌, ముద్దంగుల కృష్ణ, సాగర్‌ యాదవ్‌, గాండ్ల సురేష్‌, రమాదేవి, చంద్రకళ, పద్దం శ్రీను పాల్గొన్నారు. 

నూతన పట్టా పాస్‌ పుస్తకాలకు దరఖాస్తు చేసుకోండి

నియోజకవర్గంలో పాత పట్ట పాస్‌ పుస్తకముండి నూతన పుస్తకం రాని వాళ్లు క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే రేగా కాం తారావు తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. నియోజకవర్గంలో పా తపట్టాలుండి నూతన పట్టాపాస్‌ పుస్తకాలున్న వారు అనేకమున్నారని, వారి సమస్యను పరిష్కరించే విషయమై నేరుగా బాధిత రైతుల నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నూతన పట్టా కోసం రైతులు వారి భూమికి సంబంధించిన ఖాత నంబర్లు, సర్వే నంబర్లు, భూమి రకం(శిస్తు) వివరాలకు కలిగిన కాగితాలు, ఆధార్‌కార్డు నఖలు కాపీలను జతచేసి దరఖాస్తు రూపంలో అందించాలన్నారు. 

Updated Date - 2020-12-28T04:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising