ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ప్రజల వద్దకే కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-11-28T04:38:43+05:30

ఇక ప్రజల వద్దకే కరోనా పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


క్షేత్రస్థాయిలో పరీక్షలకు ఆర్‌బీఎస్‌కే మొబైల్‌ వాహనాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి 23వాహన బృందాలు

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

ఖమ్మం సంక్షేమవిభాగం, నవంబరు 27: ఇక ఉమ్మడి జిల్లాలో వైద్యసిబ్బంది ప్రజల వద్దకే వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో కరోనా పాజిటివ్‌, ప్రైమరీ సెకండరీ కేసులు, లక్షణాలు లేని వారికి కూడా ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్య శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆర్‌బీఎస్‌కే వాహనాలను కరోనా పరీక్షలకు వినియోగిం చుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశాలి చ్చారు. దీంతో ఖమ్మం జిల్లాలోని 11ఆర్‌బీఎస్‌కే వాహనాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 12వాహనాలు కరోనా పరీక్షలకు అందు బాటులోకి రానున్నాయి. ప్రతి వాహనంలో ఇద్దరు వైద్యులు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఔషధ ఉద్యోగితోపాటుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, పర్యవేక్షకులు పాల్గొననున్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఆదేశాలతో ప్రతీ పల్లెకు ఆర్‌బీఎస్‌కే వాహనాలు వచ్చి వృద్ధులు, చిన్నారులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ర్యాండమ్‌గా పరీక్షించనున్నారు.

Updated Date - 2020-11-28T04:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising