ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు భద్రాద్రిలో కృత్తికా దీపోత్సవం

ABN, First Publish Date - 2020-11-30T04:56:00+05:30

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అంకురార్పణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

భద్రాద్రి దేవస్థానం అనుబంద శివాలయంలో జ్వాలా తోరణం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సంప్రదాయబద్ధంగా అంకురార్పణ

భద్రాచలం, నవంబరు 28: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అంకురార్పణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలను తీసుకురాగా అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో దేవస్థానం ఈవో బి.శివాజీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం అగ్ని ప్రతిష్ఠ, హోమం నిర్వహించనున్నారు. నిత్య కల్యాణ మండప వేదిక వద్ద ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సాయంత్రం హోమం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో దీపాలను వెలిగించనున్నారు. కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏటా భద్రాద్రి రామాలయంలో కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. 


సంప్రదాయబద్ధంగా జ్వాలా తోరణం..


కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతీఏడు లాగే భద్రాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా శివాలయంలో అభిషేకాలు, సహస్రనామార్చనలు తదితర  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా పాల్గొన్నారు.


Updated Date - 2020-11-30T04:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising