ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరాహావతారంలో వరాల రాముడు

ABN, First Publish Date - 2020-12-18T04:47:13+05:30

భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముడు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వరాహావతారంలో భద్రాద్రి రామయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు నరసింహావతారం

భద్రాచలం, డిసెంబరు 17:  భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్స వాల్లో భాగంగా గురువారం శ్రీ రాముడు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ఆలయంలో వరాహావతారంలో అలంక రించి నిత్యకల్యాణమండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేదపండితులు స్వామి వారికి వేద విన్న పాలను సమర్పించారు. మధ్యాహ్నం వరాహావతారంలో స్వామివారిని ప్రత్యేక వాహనంలో చిత్రకూట మండపానికి తీసుకురాగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ్‌ కుమార్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, వైదిక, పరి పాలన సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు భద్రాద్రి రామయ్య నరసింహావతారంలో దర్శనమివ్వనున్నారు. మరోవైపు భద్రా చల సీతారామచంద్రస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన దుమ్ము గూడెం మండలం పర్ణశాలలోనూ రామయ్య గురువారం వరాహావతా రంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు భార్గవా చార్యులు, సూపరింటెండెంట్‌ కత్తి శ్రీనివాస్‌, ఇన్‌చార్జ్‌ రమేష్‌బాబు, సిబ్బంది రాము, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్లకీసేవలో సర్పంచ్‌ తెల్లం వరలక్ష్మి, తహసీల్దార్‌ రాంనరేష్‌, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T04:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising