ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ చర్యలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-09-22T05:44:30+05:30

కొత్తగూడెం సింగరేణి మైన్స్‌ ఏరియా పరిధిలో ఉన్న బొగ్గుగనులు వాటికి అనుబంధంగా ఉన్న డిపార్ట్‌మెంట్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం ఏరియాలో సేఫ్టీ జీఎం సమీక్ష 


రుద్రంపూర్‌ (సింగరేణి), సెప్టెంబరు 21: కొత్తగూడెం సింగరేణి మైన్స్‌ ఏరియా పరిధిలో ఉన్న బొగ్గుగనులు వాటికి అనుబంధంగా ఉన్న డిపార్ట్‌మెంట్లలో అవలంబిస్తున్న రక్షణ విధి విధానాలపై సోమవారం రుద్రంపూర్‌లోని జీఎం కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌ నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు అధికారులు, సేఫ్టీ, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు, పిట్‌ ఇంజనీర్లు, ఆయా గనుల మేనేజర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం సీహెచ్‌ నరసింహారావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కొత్తగూడెం ఏరియా బొగ్గుగనుల్లో కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన బాధ్యత ఆయా అధికారులపై ఉందని గుర్తుచేశారు. భూగర్భ గనుల్లో అక్కడి పని ప్రదేశాల్లో రక్షణ చర్యలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


కార్మికులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, అన్ని వర్గాల వారు కూడా రక్షణ విషయంలో వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం నరసింహారావుతోపాటు ఎస్వోటు జీఎం ఆర్‌. నారాయణరావు, ఏరియా ఇంజనీర్‌ రఘురాంరెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ జి. నాగేశ్వరరావు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు వెంకట రామిరెడ్డి (జీకేఓసీ), వెంకటాచారి (జేవీఆర్‌ఓసీ), ఏరియా ఏజెంట్‌ డి. బైద్య, డీజీఎం (సివిల్‌) టి. సూర్యనారాయణ, డీవైపీఎం డి. కిరణ్‌ బాబు, గని మేనేజర్లు వి. శ్రీనాథ్‌ (5షాఫ్ట్‌), పాలడుగు శ్రీనివాస్‌ (7షాఫ్ట్‌), ఎ. కరుణాకర్‌ (జీకేఓసీ) తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T05:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising