ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమైన మందులేవీ?

ABN, First Publish Date - 2020-08-12T10:14:26+05:30

కరోనా బారిన పడిన వారికి అందాల్సిన మందుల్లో కొరత ఏర్పడంతో.. బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా సరఫరా చేయాల్సిన మందులను సక్రమంగా సరఫ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా బాధితులకు పూర్తిస్థాయిలో అందని మెడిసిన్‌ 

హోం ఐసోలేషన్‌ వారికి నామమాత్రంగా సరఫరా


ఇల్లెందుటౌన్‌, ఆగస్టు 11: కరోనా బారిన పడిన వారికి అందాల్సిన మందుల్లో కొరత ఏర్పడంతో.. బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల ద్వారా సరఫరా చేయాల్సిన మందులను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో హోంఐసోలేషన్‌లో ఉండే వారు తమకు మందులు లభించక తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోతున్నారు. ఆజిత్రోమైసిన్‌, జింకోవిట్‌, డోలో-650, సిట్రజిన్‌, హైడ్రోక్లోరోక్విన్‌(హెచ్‌క్వూ) విటమిన్‌-సి మాత్రలను సరఫరా చేయాల్సి ఉండగా జింకోవిట్‌, హైడ్రోక్లోరోక్విన్‌ మాత్రలు ఇవ్వడం లేదు.


స్టాక్‌ లేవన్న పేరుతో ముఖ్యమైన మందులను ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఔషధ నియంత్రణ శాఖ వారు ఈ మందులు ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో అమ్మే వీలు లేకుండా చర్యలు తీసుకోవడంతో కరోనా బాధితుల పరిస్థితి డోలాయమానంలో పడింది. అటు ప్రభుత్వ సరఫరా చేయకపోవడం.. ఇటు కొనుక్కునేందుకు వీలు లేకపోవడం.. తమ ప్రాణాలపైకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంఐసోలేషన్‌లో వారికి ఏఎన్‌ఎంలు, ఆరోగ్యకార్యకర్తల ద్వారా మందుల సరఫరా చేస్తున్నా వారు కూడా అన్ని రకాల మందులు అందించలేకపోతున్నారు. 

Updated Date - 2020-08-12T10:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising