ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-31T04:50:38+05:30

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వాపురం డిసెంబరు 30: పరిశ్రమలలో  ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ముందస్తు చర్యలు చేపట్టాలని  అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం అశ్వాపురం  గౌతమీనగర్‌ కాలనీలోని  హెవీవాటర్‌ ప్లాంట్‌ అతిథి గృహంలో జరిగిన ఆఫ్‌సైట్‌ ఎమ ర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు హెవీవాటర్‌ప్లాంట్‌ ఆఫ్‌సైట్‌  గ్రామాల్లో  ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకుంటున్న  చర్యలపై ప్లాంట్‌ సేఫ్టీ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా  అదనపు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం హెవీవాటర్‌ ప్లాంట్‌లో  నిజంగానే హైడ్రోజన్‌ సల్ఫెడ్‌ విషయవాయువు  లీకయినట్లు ఆన్‌సైట్‌  చైర్మన్‌ ప్లాంట్‌ జీఎం ఆఫ్‌సైట్‌ చైర్మన్‌గా వ్యవహరించిన అదనపు కలెక్టర్‌కు తెలిపి ఆఫ్‌సైట్‌ ఎమర్జెన్సీ పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో  మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అనంతరం చేపట్టిన చర్యలపై వివిధ శాఖాధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు హెవీవాటర్‌ ప్లాంట్‌ యాజమాన్యం చేపడుతున్న  చర్యలను ప్రశంసించారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ జీఎం జి.సతీష్‌, డీజీఎం వెంకటేషు, సిఏఓ స్వామినాథన్‌,హెచ్‌ఆర్‌డిఏ మేనేజరు సుధాకర్‌, సీఐఎ్‌సఎఫ్‌ కమాండెంట్‌ మీనా, మణుగూరు ఏఎస్పీ శబరీష్‌, అడిషనల్‌ డిఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, సేఫ్టీ అధికారి వర్మ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T04:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising