ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీపీవోపై చర్యలు తీసుకోవాలి: సర్పంచ్‌ల డిమాండ్‌

ABN, First Publish Date - 2020-05-19T10:44:15+05:30

సర్పంచ్‌లపై ఆటవిక పెత్తనం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట మండలానికి చెందిన సర్పంచ్‌లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వారావుపేట, మే 18: సర్పంచ్‌లపై ఆటవిక పెత్తనం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట మండలానికి చెందిన సర్పంచ్‌లు మొడియం నాగమణి, మడకం స్వరూప, నారం రాజశేఖర్‌, కంగాల పరమేష్‌, తాటి భవాని, సీత, గంగాభవాని తదితరులు డిమాండ్‌ చేశారు.  సోమవారం మామిళ్లవారిగూడెంలో పలువురు సర్పంచ్‌లు సమావేశం అయ్యారు.


నకిలీ బ్లీచింగ్‌ను సర్పంచ్‌లకు తెలియకుండా నేరుగా ఎంపీడీవో కార్యాలయాల్లో దింపింది నిజంకాదా? సర్పంచ్‌లు అడిగిన కంపెనీనుంచి కాక కమిషన్‌లు ఇచ్చిన కంపెనీనుంచి ట్రాక్టర్‌లను కొనుగోలు చేసింది నిజం కాదా? అంటూ సర్పంచ్‌లు ప్రశ్నించారు. పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ప్రతి నెలా సర్పంచ్‌లు మామూళ్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారని ఆరోపించారు. అంతేకాదు చెక్‌లు రాయకపోతే చెక్‌ పవర్‌ను రద్దు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన సంఘటనలను వారు గుర్తుకు చేశారు. మొత్తం వ్యవహారంపై కలెక్టర్‌కు, రాష్ట్ర పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రికి, సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-05-19T10:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising