ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 నెలల చిన్నారి.. నాలుగు నెలలుగా వెంటిలేటర్‌పైనే

ABN, First Publish Date - 2020-06-19T18:24:59+05:30

కొత్తగూడెం సింగరేణి మెయిన్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన వైద్యం అందిస్తున్నారు. 16 నెలల వయస్సు కలిగిన ఒక బాలుడిని బతికించేందుకు డాక్టర్లూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పోరాటం

కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి వైద్యులు


రుద్రంపూర్‌ (సింగరేణి) : కొత్తగూడెం సింగరేణి మెయిన్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన వైద్యం అందిస్తున్నారు. 16 నెలల వయస్సు కలిగిన ఒక బాలుడిని బతికించేందుకు డాక్టర్లూ, సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా వెంటిలేటర్‌ పై నే వైద్యం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పి. సుజాత విలేఖర్లకు అందించిన వివరాల ప్రకారం రామగుండం డివిజన్‌-2లో ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ కార్మికుడి దంపతులకు 16 నెలల క్రితం ఒక బాబు పుట్టాడు.


అప్పటి నుంచి శ్వాస కోశ సంబంధిత వ్యాధిలో ఆ పసికందు ఇబ్బంది పడుతున్నాడు. సింగరేణి స హకారంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రూ.16లక్షలు ఖర్చయ్యాయి. ఇక ఖర్చులు భరించలేక కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ నాలుగు నెలలుగా వెంటిలేటర్‌ పైనే వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌, డాక్టర్‌ కృష్ణమూర్తి, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్టు వివరించారు.

Updated Date - 2020-06-19T18:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising