ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ABN, First Publish Date - 2020-08-22T17:02:02+05:30
ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులపై ఆటోమేటిక్ డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్ ఏర్పాటుతో పాటు దర్శనానికి వచ్చే భక్తులకు సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మాస్క్ లేకపోతే మహాగణపతి దర్శనానికి నిర్వాహకులు అనుమతి నిరాకరిస్తున్నారు.
Updated Date - 2020-08-22T17:02:02+05:30 IST