ఖైరతాబాద్‌లో ఆకర్షణగా మూడడుగుల మురమరాల గణేష్
ABN, First Publish Date - 2020-08-22T16:03:27+05:30
ఖైరతాబాద్ మహా గణపతి వద్ద మూడు అడుగుల మురమరాల గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద మూడు అడుగుల మురమరాల గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మియాపూర్‌కు చెందిన భక్తాంజనేయ స్వీట్స్ మురమరాలతో ప్రత్యేకంగా తయారుచేసిన వినాయకుని విగ్రహాన్ని సమర్పించింది. 50 కేజీల మురమురాలు, 50 కేజీల బెల్లం, ఐదు కేజీల కాజుతో ప్రత్యేకంగా మురమరాల వినాయకుడిని తయారు చేశారు. అలాగే ఖైరతాబాద్ మహా గణపతికి 200 కేజీల లడ్డూను భక్తాంజనేయ స్వీట్స్‌ను సమర్పించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని ఈ ఏడాది తొమ్మిది అడుగుల ఎత్తుతో మాత్రమే తయారు చేశారు. కరోనాను తరమికొట్టేందుకు ఈసారి స్వామివారు ‘ధన్వంతరి నారాయణ మహా గణపతి’గా దర్శనమివ్వనున్నారు. ఏకదంతుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి విగ్రహాలు 4 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.
Updated Date - 2020-08-22T16:03:27+05:30 IST