ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భర్తను హత్య చేశారు

ABN, First Publish Date - 2020-10-20T09:56:27+05:30

తన భర్తను జైలులోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు భార్య స్వప్న సోమవారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యారక్‌లోని నలుగురితో పాటు జైలర్‌పై అనుమానాలు
  • హెచ్చార్సీలో మాజీ తహసీల్దార్‌ భార్య ఫిర్యాదు

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తన భర్తను జైలులోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు భార్య స్వప్న సోమవారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తతో పాటు బ్యారక్‌లో ఉన్న మరో నలుగురు, జైలర్‌పై అనుమానాలున్నాయని చెప్పారు. నాగరాజు మృతిలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతల ప్రమేయముందని, వారే ఆయనను హత్య చేయించారని ఆరోపించారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తన భర్త మృతిపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని హెచ్చార్సీని కోరారు. కమిషన్‌ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాగరాజు మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. కనీసం పట్టించుకోలేదన్నారు. నాగరా జు చిన్న టవల్‌తో కిటికీకి ఉరేసుకుని చనిపోయే అవకాశం లేదని చెప్పారు. ఈ నెల 13న పిల్లలతో నాగరాజు వీడియోకాల్‌ మాట్లాడారని, పరీక్షలు బాగా రాయాలని, దసరాకు ఇంటికి వస్తానని చెప్పారని వివరించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని హెచ్చార్సీని కోరారు.  

Updated Date - 2020-10-20T09:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising