ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

ABN, First Publish Date - 2020-12-10T18:18:25+05:30

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా మిట్టపల్లిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా మిట్టపల్లిలో నిర్మించిన రైతు వేదికను కూడా ప్రారంభించారు. కొండపాక మండలం దుద్దేడ శివారులో ఐటీ టవర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీని పరిశీలించి, మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభిస్తారు. సిద్దిపేట శివారు నర్సాపూర్‌లో నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో తొలివిడతగా 144 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. విపంచి ఆడిటోరియంను ప్రారంభించి కోమటిచెరువు మినీ ట్యాంకుబండ్‌ను సందర్శిస్తారు. తర్వాత రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ గుట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేటలో మధ్యాహ్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సిద్దిపేట చాలా డైనమిక్ ప్రాంతమని కొనియాడారు. త్వరలో సిద్దిపేటకు ఎయిర్‌పోర్ట్ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ తెలిపారు. 

Updated Date - 2020-12-10T18:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising