ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సూచనలు

ABN, First Publish Date - 2020-04-25T23:53:24+05:30

లాక్‌డౌన్, సెల్ఫ్ క్వారంటైన్ శాశ్వత పరిష్కారం కాదని, ఇది కేవలం ఉపశమనమేనని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. దక్షిణకొరియా తరహాలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం అమలు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్, సెల్ఫ్ క్వారంటైన్ శాశ్వత పరిష్కారం కాదని, ఇది కేవలం ఉపశమనమేనని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. దక్షిణకొరియా తరహాలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చే నిధుల్లో పారదర్శకత లేదని, కొనుగోలు ఒప్పందాల పేరుతో సేకరిస్తున్న నిధుల్లో చీకటి కోణం ఉందని ఆరోపించారు. కరోనాకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. 2వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినవేనని వెల్లడించారు. కరోనా కోసం ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు పెట్టింది శూన్యమని ఆయన తప్పుబట్టారు. కేరళ సీఎం పినరయి ప్రతిపక్షనేతతో కలిసి కరోనాపై సమీక్షలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సలహాలు ఎందుకు తీసుకోరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 3 నెలలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 22,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, ధనిక రాష్ట్రానికి ఇది సమస్య కాదన్నారు. పేదలకు మూడు నెలల విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కోరారు. ఆర్థిక, వైద్య, పాలన నిపుణులతో మూడు కమిటీలు వేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-25T23:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising