ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు

ABN, First Publish Date - 2020-03-30T02:12:36+05:30

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. రూ.3,200 కోట్లకుపైగా మార్క్‌ఫెడ్‌కు గ్యారంటీ ఇచ్చామని, రైతులకు కూపన్లు ఇచ్చి వాటి ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. కోటి 5 లక్షల టన్నుల వరి వచ్చే ఆస్కారం ఉందని, రైతులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మార్కెట్‌ యార్డులన్నీ మూసివేశాం, గ్రామాల్లోనే కొనుగోళ్లు చేస్తామన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తేవొద్దని, గ్రామాల్లో కరోనా నియంత్రణ ఎక్కువగా ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచామని, రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ అన్నారు. హార్వెస్టర్లు ఎక్కించే వారికి స్పెషల్‌ పాసులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T02:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising