ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి

ABN, First Publish Date - 2020-11-28T05:21:48+05:30

స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతోపాటు మహిళలందరిని ఇందులో భాగస్వాములు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు సూచించారు.

మాట్లాడుతున్న కమిషనర్‌ వల్లూరి క్రాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి 

 నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 27: స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతోపాటు మహిళలందరిని ఇందులో భాగస్వాములు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది కరీంనగర్‌ నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షన్‌లో 72వ ర్యాంకును సాధించగా ఆసారి 20లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీపై మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వడం, ఇళ్లలో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని డంపింగ్‌యార్డుకు చెత్త తగ్గించేందుకు కృషిచేయడం, ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా జ్యూట్‌ బ్యాగులను, బట్టసంచులను, టిఫిన్‌ బాక్సులను వినియోగించడం వంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎన్విరాన్‌మెంటల్‌ అధికారి స్వామి, టీటీసీ నిర్వాహకులు కరుణాకర్‌, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత, సీడీలు పద్మ, తిరుపతి, దీప పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising