ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా పోలీసులు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-10-23T10:51:29+05:30

పోలీసుశాఖలోని వివిధ స్థాయిలకు చెందిన మహిళా అధికారులు అన్నిరకాల సవాళ్ళను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పిలుపునిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 22: పోలీసుశాఖలోని వివిధ స్థాయిలకు చెందిన మహిళా అధికారులు అన్నిరకాల సవాళ్ళను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహిళా పోలీసులకు ఆసక్తి ఉన్నరంగాల్లో అవకాశాలను కల్పించనున్నామని అన్నారు. గురువారం కమిషనరేట్‌లో అన్నిస్థాయిలకు చెందిన మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళాపోలీసులు ఆత్మన్యూనతాభావాన్ని విడనాడి ఆత్మస్థైర్యంతో ముందుకువచ్చి పురుషులతో సమానంగా విధులను నిర్వి హంచేందుకు పోటీపడాలన్నారు.


నోడల్‌ అధికారుల నియామకం..

మహిళా పోలీసులు తమ సమస్యలు తనదృష్టికి తీసుకువచ్చేం దుకు వీలుకానిపక్షంలో మహిళా అధికారిణిల ద్వారా సమస్యలు తెలి యజేసేందుకు హుజురాబాద్‌ సీఐ మాధవి, రామడుగు ఎస్సై గొల్ల పల్లి అనూషలను నోడల్‌ అధికారులు నియామకం చేశామని సీపీ తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జీ చంద్రమోహన్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి సాధన రష్మీ పెరుమాళ్‌, హుజురాబాద్‌ సీఐ వీ మాధవి, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్‌, ఎస్సై అనూష, ఎం సురేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T10:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising