ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారం చేయాలి

ABN, First Publish Date - 2020-12-13T05:53:09+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ, అ భివృద్ధి పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న దుగ్యాల ప్రదీప్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ 

కాల్వశ్రీరాంపూర్‌, డిసెంబరు 12: కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ, అ భివృద్ధి పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో అవినీతి లేని పాలన నడుస్తోందని, బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి కార్యకర్త ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో కుటుంబం పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. టీఆర్‌ఎస్‌లో సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలంతా భూకబ్జాలు, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. జర్నలిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని, అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతిపై వార్తలు రాసే విలేకరులపై దాడులు చేస్తోందన్నారు. అనంతరం దుగ్యాల ప్రదీప్‌రావును బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు ప్రదీప్‌ కుమార్‌కు ఘన స్వాగతం పలికి గంగారం నుంచి కాల్వశ్రీరాంపూర్‌ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గూడెపు జనార్ధన్‌రెడ్డి, నాయకులు తాత రవి, అమరగని ప్రదీప్‌కుమార్‌, మాజీ ఎంపీటీసీ పర్వతాలు, పెద్దపల్లి కౌన్సి లర్‌ రాజమహంత కృష్ణ, చిలువేరు సంపత్‌కుమార్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాగుల రాజుకుమార్‌, ఎస్‌సీ మోర్చా మండల అధ్యక్షుడు పురుషోత్తం అనిల్‌, గుడ్ల నరేష్‌, తాత రాజు, రాపర్తి గోపి, రేవెళ్లి రాజు, మంథని రామస్వామి, దారి సంతోష్‌, బెజ్జకి దిలీప్‌, కుస నాగరాజు, పడి అనీల్‌రెడ్డి, కుక్క వంశీకృష్ణ, సాయి, వేణు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising