ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌ను కరోనా లేని నగరంగా మార్చుతాం

ABN, First Publish Date - 2020-04-08T10:13:07+05:30

సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో కరీంనగర్‌ను కరోనా లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని మేయర్‌ యాదగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7: సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో కరీంనగర్‌ను కరోనా లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మున్సిపల్‌ కార్మికులకు 5వేల రూపాయల కానుక ప్రకటించడంపై కార్మికులు మంగళవారం సాయంత్రం కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్మికులకు యాప్రాన్‌లను పంపిణీ చేశారు. నగరంలోని నాకా చౌరస్తా వద్ద 3, 4, 5, 24, 25 డివిజన్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మంగళవారం మేయర్‌ సునీల్‌రావు,  కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్‌, సుజ్జత్‌ పర్వీన్‌, ఆలీబాబాతో కలిసి కూరగాయలు పంపిణీచేశారు.  భగత్‌నగర్‌ అప్పయ్యస్వామి టెంపుల్‌ వద్ద బొందుగుల వారి ఆధ్వర్యంలో 600మందికి అన్నదానం చేయగా మేయర్‌ వడ్డించారు.


35వ డివిజన్‌లోని శ్రీనగర్‌కాలనీలో ఆరిఫ్‌ ఉస్మాన్‌ ఆర్థిక సాయంతో కార్పొరేటర్‌ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  నగరంలోని 22, 42, 43, 44, 45 డివిజన్ల కార్మికులకు, వావిలాలపల్లి పార్కులో, 1,2 డివిజన్‌ కార్మికులకు చంద్రపురి కాలనీ, తీగలగుట్టపల్లిలో స్థానిక కార్పోరేటర్లతో కలిసి మేయర్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాంనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఇళ్లకు డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణిహరిశంకర్‌ వెళ్లి బియ్యం, నూనె, కందిపప్పు, కోడిగుడ్లు, పాలు అందజేశారు. పేదవైశ్యులకు తమవంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అశోక్‌నగర్‌ శ్రీవాసవీ వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో 20మంది పేద వైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

Updated Date - 2020-04-08T10:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising