ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఆపన్నహస్తం అందించాలి

ABN, First Publish Date - 2020-04-10T11:05:24+05:30

లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఇబ్బందులు తప్పవని, వారికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివిధ రూపాల్లో సహాయాన్ని అందించాలని నగర మేయర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేటర్లు డివిజన్‌ ప్రజలను ఆదుకోండి 

మేయర్‌ వై సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఇబ్బందులు తప్పవని, వారికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివిధ రూపాల్లో సహాయాన్ని అందించాలని నగర మేయర్‌ వై సునీల్‌రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నగర పాలకసంస్థ పరిధిలోని ప్రతి కార్పొరేటర్‌ పేదలను ఆదుకునే కార్యక్రమాలు చేయాలని సూచించారు.


42వ డివిజన్‌ క్రిస్టియన్‌ కాలనీలో మాజీ కార్పొరేటర్‌ నడిపెల్లి అశోక్‌రావు ఆయన నివాసం వద్ద 42,43 డివిజన్లలో పనిచేసే 33మంది మున్సిపల్‌ కార్మికులకు, పేదలకు కార్పొరేటర్‌ మేచినేని వనజ అశోక్‌రావు, దాత నడిపెల్లి అశోక్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి మేయర్‌ వై సునీల్‌రావు ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీచేశారు. 15వ డివిజన్‌లో మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్‌ నాగసముద్రం జయలక్ష్మితో కలిసి డివిజన్‌లో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు పంపిణీచేశారు. 23, 36 43, 45 డివిజన్లలో కార్పొరేటర్లు అర్ష కిరణ్మయి మల్లేశం, గుగ్గిల్ల జయశ్రీ, సరిల్ల ప్రసాద్‌, పిట్టల వినోదశ్రీనివాస్‌తో కలిసి మేయర్‌ సునీల్‌రావు కూరగాయలు పంపిణీచేశారు. 

Updated Date - 2020-04-10T11:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising