దేశ వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2020-12-07T05:33:02+05:30
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేఖంగా 8న చేపట్టనున్న దేశ వ్యాప్త బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
జగిత్యాల టౌన్, డిసెంబరు 6: కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేఖంగా 8న చేపట్టనున్న దేశ వ్యాప్త బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి రఘ గార్డెన్‌లో ఆదివారం సీపీఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం చాడ మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను, కేంధ్ర సంస్థలను నిర్వీర్యం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు వీఎస్ బోస్, జిల్లా కార్యదర్శి ఎద్దండి భూమయ్య, సహా య కార్యదర్శి చెన్న విశ్వనాఽథం, జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, రాజ లింగం, హన్మంతు, శాంత, ముఖ్రం, రాధ, సురేష్, దేవదాస్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-07T05:33:02+05:30 IST