ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపని ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-06-06T10:25:11+05:30

పండించిన పంటలను కొనుగోలు చేయడంలో జవాబుదారితనం లోపించిందని, అన్నదాతల్లో ఆత్మస్థైర్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ 


ఎల్లారెడ్డిపేట, జూన్‌ 6ః పండించిన పంటలను కొనుగోలు చేయడంలో జవాబుదారితనం లోపించిందని, అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపడంలో  ప్రభు త్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆత్మ హత్యకు యత్నించి  మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న కోనరావుపేట మండలం శివంగాలపల్లికి చెందిన రైతు గుడి మహిపాల్‌రెడ్డిని శుక్రవారం పరామర్శించారు. ఈ సంద ర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా సాగు నీరు అందించామని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్‌కు పండించిన పంటను కొనుగోలు చేసి నిల్వ చేయడం చేతకాలేదని విమ ర్శించారు.


మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పంటను దహనం చేసినా, టవర్‌ ఎక్కినా మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.   బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించాలని, కౌలు రైతు మహిపాల్‌రెడ్డికి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇన్‌చార్జి రాంనాథ్‌, నాయకులు మల్లికార్జున్‌, గోపి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising