ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

ABN, First Publish Date - 2020-05-12T10:03:01+05:30

తెలంగాణలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి ఈటల రాజేందర్‌


జమ్మికుంట రూరల్‌, మే 11: తెలంగాణలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం మున్సిపల్‌ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గల స్నేహా ఫిడ్స్‌లో మక్కల దిగుమతి కేంద్రాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంగనర్‌ ఎల్‌ఎండీ దిగువన ఉన్న పంట పొలాలకు కాళేశ్వరం నీళ్లు అందాయని తెలిపారు.


మక్కలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. వచ్చిన పంటలను కొనుగోలు కేంద్రాల వద్ద తడువకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంటల కొనుగోళ్ల మీద జిల్లాకు ఒక ప్రత్యేకాధికారిని నియమించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుకుంటున్నామని తెలిపారు. మక్కలు ఊహించని విధంగా దిగుబడి వచ్చినందున గోదాములు సరిపోలేదన్నారు.


అందుకే స్నేహా ఫీడ్స్‌ వారి స్టోరేజి కేంద్రాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. కమలాపూర్‌ మండలం వరంగల్‌లో కలిసిందని, వారికి పంట నిల్వలు పెట్టుకునేందుకు స్థలం లేదన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-12T10:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising