ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం లింక్‌-2 నిర్మాణం నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-12-12T05:04:34+05:30

కాళేశ్వరం లింక్‌-2 ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పెగడపెల్లి మండలంలోని పలు గ్రా మాల రైతులు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేప ట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట ఫ్లకార్డులతో ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ ఎదుట పెగడపల్లి వాసుల ఆందోళన

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 11: కాళేశ్వరం లింక్‌-2 ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పెగడపెల్లి మండలంలోని పలు గ్రా మాల రైతులు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెగడపెల్లి మండలం నా మాపూర్‌, నందగిరి, ఏడు మూటలపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-2 ప్యాకేజీ నిర్మాణం కింద మూడు గ్రామాల్లో సుమారు 250 ఎక రాల భూమిని చిన్న, సన్నకారు రైతులే కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రైతు పక్షపాతిని అంటూనే ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కుంటూ, బతుకులను రోడ్డుకు ఈడుస్తున్నారన్నారు. ప్రా జెక్ట్‌ నిర్మాణం కోసం తక్కువ ధరకు భూములు సేక రించారని ఆరోపిం చారు. లింకేజీ ప్రాజెక్ట్‌ నిర్మాణం వెంటనే ఆపాలని, లేదా లింక్‌2 ప్రాజెక్ట్‌ కోసం భూసేకరణ రద్దుపర్చి, అండర్‌ టన్నెల్‌ నిర్మాణం పనులు చేపట్టా లని రైతులు డిమాండ్‌ చేశారు. లింకేజీ ప్రాజెక్ట్‌ నిర్మాణం పట్ల సీఎం కే సీఆర్‌ పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరేంధర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాలోజీ గంగారాం, తిరుపతి రెడ్డి, రవీంధర్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామకృష్ణరెడ్డి, మల్లేశం, శ్రీనివాస్‌యాదవ్‌, గం గయ్య, రాములు, రాజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-12-12T05:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising