ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-12-29T04:45:18+05:30

రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

ఓపెన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

కోల్‌సిటీ, డిసెంబరు 28: రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం స్థానిక 47వ డివిజన్‌లో రూ.50లక్షల వ్యయంతో మిడియన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్తాన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులు వెచ్చించి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో వెల్లివిరిసేలా పట్టణ ప్రగతిలో ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని కోరగా ఫుట్‌పాత్‌ల ఏర్పా టుకు నిధులు వెచ్చిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు మేకల సదానందం, బాలరాజ్‌కుమార్‌, నాయకులు పొన్నం లక్ష్మణ్‌గౌడ్‌, అడప శ్రీనివాస్‌, మేకల పోషం, చొక్కారావు పాల్గొన్నారు.

ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లు ప్రారంభం..


కోల్‌సిటీ: నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారిని వ్యాయామం వైపు ప్రోత్సహించడాని కి ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లను ఏర్పాటు చేసినట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పీజీ క ళాశాల, మున్సిపల్‌ కార్యాలయం, దుర్గానగర్‌, గౌతమినగర్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ఎయిర్‌ జిమ్‌లను, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌, దు ర్గానగర్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన గజీబోలను, మార్కండేయకాలనీ నుంచి ఇందిరానగర్‌ క్రాస్‌ రోడ్డు వరకు మీడియన్‌, శివాజీనగర్‌లో భూగర్భ మురుగు నీటి కాలువ నిర్మాణ పనులను సోమవారం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభంచా రు. రెండేళ్లలో రామగుండం నగరంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మేయర్‌ అనిల్‌ కుమార్‌, క మిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T04:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising