ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభిరుచులను పంచిన తెలంగాణ ఫుడ్‌ ఫెస్ట్‌ 2020

ABN, First Publish Date - 2020-02-28T11:42:11+05:30

అభిరుచులను పంచిన తెలంగాణ ఫుడ్‌ ఫెస్ట్‌ 2020

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌ , ఫిబ్రవరి 27: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, తెలంగాణ వంటకాల అభిరుచులను గుర్తుచేస్తూ పట్టణంలోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్‌ ఫెస్ట్‌ 2020 అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు స్వతహాగా తెలంగాణ వంటకాలైన సర్వపిండి, పులిహోర, అరిసెలు, పకోడి, రవ్వ లడ్డూ, అరిసెలు, కరియలు,  ఇతర పిండివంటలు, పాయసాలు, తీపి పదార్థాలు, సత్తు పిండ్లు, గడుక, జొన్న అంబలి, ఇలా 116 రకాల వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. కాగా విద్యార్థులు చేసిన పిండివంటలు రుచులు హౌరా.. అనిపించాయి. తెలంగాణ ఫుడ్‌ ఫెస్ట్‌ తో కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. 


చంద్రకళ, బీఏ, ఫైనల్‌ ఇయర్‌

మా కళాశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇలాంటి  వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ఒకే కుటుంబంలా ఈ వేడుకల్లో పాల్గొనడం మరింత సంతోషాన్ని కల్గిస్తుంది.


నందిని, ఎంపీసీఎస్‌, ఫైనల్‌ ఇయర్‌

  మా స్వతహాగా పిండివంటలు చేశాం. తెలంగాణ రాష్ట్ర పిండివంటల అభిరుచుల గొప్పతనం వివరించేలా మా కళాశాలలో ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. అందరం కలిసి ఉత్సాహం, ఆనందంతో జరుపుకుంటున్నాం.


శ్రీనివాస్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌

విద్యార్థులకు తెలంగాణ వంటల ప్రాశస్త్యంతో , తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరించేందుకే ఈ వేడుకలు నిర్వహించాము. ఈ వంటల్లో ఉన్న పోషక విలువల గురించి విద్యార్థులకు వివరించాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌, సిబ్బంది, విద్యార్థులకు ధన్యవాదాలు. 

Updated Date - 2020-02-28T11:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising