ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాస కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN, First Publish Date - 2020-05-20T10:13:48+05:30

పొలాస వ్యవసాయ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సి.నరేందర్‌ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సి. నరేందర్‌రెడ్డి


జగిత్యాల అగ్రికల్చర్‌, మే 19: పొలాస వ్యవసాయ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ సి.నరేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం నూతనంగా విధుల్లో చేరిన నుంచి తొలిసారిగా వ్యవసాయ కళాశాలలోని తన ఛాంబర్‌లో విలేఖరులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 నుంచి 2001 వరకు జగిత్యాల వ్యవసాయ కళాశాలలో పనిచేశానని, అనంతరం అశ్వరావుపేట్‌ వ్యవసాయ కళాశాలలో డీన్‌గా విధులు నిర్వహించి, బదిలీపై ఏప్రిల్‌లో జగిత్యాల పొలాస కళాశాలకు వచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎవరినీ కలవలేదని పేర్కొన్నారు.


తాను పనిచేసిన చోట జాతీయ స్థాయిలో 3వ ర్యాంకుతో పాటు 11,16 ర్యాంకులు సాధించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా పలు కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులు అనర్గలంగా మాట్లాడేందుకు టాక్‌ క్లబ్‌, యూత్‌ పార్లమెంట్‌, గ్రీన్‌ క్లబ్‌, కౌన్సిలింగ్‌, మోటివేషన్‌, హెల్త్‌ క్లబ్‌ టీంల ఏర్పాటుతో పాటు, పోటీ పరీక్షల్లో రాణించేందకు ప్రముఖులతో గైడెన్స్‌ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు. మీ అందరి సహకారంతో కళాశాల అభివృద్దికి  ప్రత్యేక చర్యలు తీసుకుని, పొలాస కళాశాలను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని డీన్‌ నరేందర్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2020-05-20T10:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising