ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గద్దెనెక్కిన సమ్మక్క, సారలమ్మలు

ABN, First Publish Date - 2020-02-07T12:09:42+05:30

మహిమ గల తల్లుల దీవెన కోసం జిల్లా నుంచి మేడారం మహా జాతరకు లక్షమందికిపైగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోరుగా తల్లులకు మొక్కులు
మేడారం తరలిన లక్ష మంది భక్తులు
జిల్లాలో పలు చోట్ల జోరుగా జాతరలు
 
 మహిమ గల తల్లుల దీవెన కోసం జిల్లా నుంచి మేడారం మహా జాతరకు లక్షమందికిపైగా తరలివెళ్లారు. అదేసంఖ్యలో సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల రెండేళ్లకొకసారి జరిపే సమ్మక్క, సారలమ్మల జాతరలో పాల్గొన్నా రు. గురువారం జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌, వీర్నపల్లి మం డలం శాంతినగర్‌, బాబాయ్‌ చెరువు తండా, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పా పూర్‌, కోనరావుపేట మండలం శివంగళపల్లె, ఇల్లంతకుంట మండల కేంద్రా ల్లో వనదేవతల ప్రతిష్ఠించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో భక్తుల్లో ఆధ్యాత్మికత, తన్మయత్వంతో తల్లులను దర్శించుకుంటున్నారు. మూడు రోజులపాటు ఈ మినీ జాతర జరగనుంది. వేలాదిమంది భక్తులు నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని పంచిపెడుతున్నారు. తలనీలాలు, మొక్కులను సమర్పిం చుకుంటారు. తల్లులకు బోనాల మొక్కులను సమర్పించుకున్నారు.
 
మేడారం పూజ విధానమే...
మేడారం జరిగినట్టుగానే జిల్లాలోని పలుచోట్ల గద్దెలను ఏర్పాటు చేసి పూజా విధానాలను పాటిస్తారు. ఎంతో అట్టహాసంగా పూజలు చేస్తారు. జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మల మినీజాతరలకు పొరుగు జిల్లాలు కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. వీరితోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రావడం విశేషం
 
జాతరల వద్ద బందోబస్తు
సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, వీర్నపల్లి, కోనరావుపేట, ఇల్లంత కుంట మండలాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరల వద్ద నిర్వహాకులు భక్తుల కు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం వరకు జరి గే సమ్మక్క, సారలమ్మల ఉత్సవాల ప్రాంతాల్లో జనంతో సందడిగా కనిపించనుంది.
 
తల్లులను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
జిల్లాలోని సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద ప్రజాప్రతనిధులు దర్శించు కున్నారు. కోనరావుపేట మండలం శివంగళపల్లెలో జిల్లా పరిషత్‌ చైర్‌ప ర్సన్‌ న్యాలకొండ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఇల్లంత కుంటలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. వీరితోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2020-02-07T12:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising